Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూబ్లీహిల్స్ లో వ్యక్తి దారుణహత్య

Man murdered in Hyderabad Jubilee Hills
  • శివ అనే కూలీని తల పగులగొట్టి హత్య చేసిన వైనం
  • స్నేహితుడిపైనే పోలీసుల అనుమానాలు
  • నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి మందు తాగిన శివ
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని శివ (40)గా గుర్తించారు. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. శివ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఫుట్ పాత్ పైనే జీవిస్తున్నాడు. నిన్న రాత్రి నెంబర్ 10బీలో ఫుట్ పాత్ పైనే మరో ముగ్గురు తోటి కూలీలు డేవిడ్, రాకేశ్, శ్రీనివాస్ లతో కలిసి మందు తాగాడు. అనంతరం రాకేశ్, శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. శివ, డేవిడ్ మాత్రం అక్కడే ఉండిపోయారు.

తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో శ్రీనివాస్ అక్కడకు వచ్చి చూడగా... శివ తల పగిలి, రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించాడు. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. హత్యలో అనుమానితుడిగా భావిస్తున్న డేవిడ్ కోసం గాలింపు చేపట్టారు.
Hyderabad
Jubilee Hills
Murder

More Telugu News